ట్యాలెంట్ తోనే అవకాశాలు వస్తాయి – కైరా అద్వానీ !
Published on Jun 13, 2018 11:55 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యువ కథానాయిక కైరా అద్వానీ. మొదటి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా తరువాత ఆమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది .

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కైరా ఇండస్ట్రీ లో ఎలా కంటిన్యూ కావాలో వివరించింది.ఇక్కడ కొనసాగాలంటే ట్యాలెంట్ తో పాటు మనం చేసే పని నచ్చాలి అప్పుడు తప్పకుండ ప్రతి ఒక్కరూ మనల్ని గుర్తించి అవకాశాలు ఇస్తారు అని చెప్పుకొచ్చింది . కైరా హిందీ లో నటించిన ధోని చిత్రంతో మంచి గుర్తింపును తెచుకున్నారు .ప్రస్తుతం బాలీవుడ్లో మరో రెండు సినీమాల్లో నటిస్తుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook