బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యారు స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. నూతన దర్శకుడు శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని వంశధార క్రియేషన్స్ నిర్మిస్తుంది . ఈ చిత్రానికి సంబంధించిన హిందీ శాటిలైట్ హక్కులు రూ.9.50 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడుపోవడం విశేషం.
బాలీవుడ్ నటుడు నిల్ నితిన్ ముఖేశ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘జయ జానకి నాయక’ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న సాయి శ్రీనివాస్ జూలై 20న ‘సాక్ష్యం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు.


