‘సీత’గా రాబోతున్న కాజల్ అగర్వాల్ !

‘సీత’గా రాబోతున్న కాజల్ అగర్వాల్ !

Published on Dec 9, 2018 3:55 AM IST

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా తాజగా ఈ చిత్రం టైటిల్ కి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ తెలిసింది. ఈ చిత్రానికి దర్శకుడు తేజ ‘సీత’ అని టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాలో కాజల్ పాత్ర పేరు సీత అట. అందుకే సీత అని పేరు పెట్టారు.

కాగా ఇప్పటికే ఈ చిత్రం టాకీ పార్ట్ కూడా దాదాపు పూర్తి చేసుకుందట. ఇక కేవలం ఒక్క సాంగ్ మైత్రమే మిగిలి ఉందని, అది కూడా త్వరలోనే షూట్ జరుపుకోబోతుందని సమాచారం అందుతుంది.

ఇక ఈ చిత్రం తేజ దర్శకత్వ శైలిలోనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మరియు మంచి భావోద్వేగ సన్నివేశాలతో ఈ సినిమా సాగుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ చిత్రంలో కొత్తగా కనిపించనున్నాడు. సోనూసూద్ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు