
తారక్ తో కలిసి నటించిన ‘టెంపర్’ సినిమా తరువాత కాజల్ మరో తెలుగు సినిమాకు సంతకం చెయ్యలేదు. తమిళనాట మరియు బాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్ లలో నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఒక బాలీవుడ్ చిత్రంకోసం కాజల్ మలేసియాలో కౌలా లంపూర్ లో షూటింగ్ లో పాల్గుంటుంది.
ఈ సినిమాలో కొన్ని ముఖ్యసన్నివేశాలను గతకొద్దిరోజులుగా ఇక్కడ తెరకెక్కిస్తున్నట్టు కాజల్ తెలిపింది. ఇక్కడ షూటింగ్ పూర్తవ్వగానే కాజల్ – విశాల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పాయమ్ పులి’ సినిమా షూటింగ్ లో పాల్గోనుందని సమాచారం.

