చిరంజీవి స‌ర‌స‌న‌ కాజ‌ల్

Actress-Kajal
మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైనా హీరోయిన్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.కాగా కాజాల్ అగర్వాల్ ఈ చిత్ర హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు నిన్నటి నుంచి సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కాగా మీడియా లో వస్తున్న వార్తల ప్రకారం కాజల్ ఈ చిత్రానికి రూ 2.50 కోట్లు పారితోషకాన్ని డిమాండ్ చేస్తోందని సమాచారం. కాగా కొన్ని రోజుల్లో దీనిపై అధికారిక సమాచారం రావచ్చు.