కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ అందుకున్న కాజల్

Published on Jun 29, 2021 2:40 pm IST

అందాల చందమామ కాజల్ అగర్వాల్ మునుపటిలా వచ్చిన ప్రతి సినిమానూ చేసుకుంటూ వెళ్లట్లేదు. కేవలం పాత్రకు ప్రాముఖ్యత ఉన్న కథలనే ఎంచుకుంటూ వెళ్తోంది. ఇటీవల ఆమె బాలీవుడ్లో ‘ఉమా’ అనే చేసింది. ఈ సినిమాను నూతన దర్శకుడు తతగత సింఘా డైరెక్ట్ చేయనున్నాడు. మిరాజ్ గ్రూప్ బ్యానర్ పై అవికేష్ ఘోష్ – మంతరాజ్ పాలివాల్ సినిమాను నిర్మించనున్నారు. ఒక పెళ్లి ఇంట్లో చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే ఈ ‘ఉమా’. ఇందులో ప్రధాన పాత్ర కాజల్ అగర్వాల్ చేయనుంది.

నిజానికి పెళ్లి తర్వాత హీరోయిన్లకు డిమాండ్ కాస్త తగ్గుతుంది. ఒక్కోసారి పారితోషకం కూడ తగ్గించుకోవాల్సి వస్తుంది. కానీ కాజల్ అగర్వాల్ విషయంలో అది రివర్స్ అయింది. ‘ఉమా’ చిత్రం కోసం ఈమె భారీ రెమ్యునరేషన్ పుచ్చుకుందట. ఇక ఆ మొత్తం ఎంత అంటే రెండు కోట్ల రూపాయలు అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. కాజల్ అగర్వాల్ కెరీర్లో ఇదే హయ్యస్ట్ రెమ్యునరేషన్. ఈ సినిమాతో పాటు కాజల్ చేతిలో ఇంకో నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున వంటి స్టార్ హీరోల చిత్రాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :