క్యాబ్ డ్రైవర్ పట్ల కాజల్ పెద్ద మనసు

క్యాబ్ డ్రైవర్ పట్ల కాజల్ పెద్ద మనసు

Published on Mar 18, 2020 8:30 PM IST

కరోన వైరస్ కారణంగా ప్రజల రోజువారీ జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయి. వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే రోజువారీ కూలి పనులు చేసుకునేవారు పనిలేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. అలాంటి ఘటననే ఒకదాన్ని చూసిన కాజల్ అగర్వాల్ చలించిపోయారు. ఆ యధార్థ సంఘటనను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌తో షేర్‌ చేసుకున్నారు.

కాజల్ క్రితం రోజు పని మీద బయటికి వెళుతూ క్యాబ్ బుక్ చేసుకుందట. ఆ సమయంలో సదరు క్యాబ్ డ్రైవర్ కాజల్ ముందు కన్నీరు పెట్టుకున్నాడట. కరోనా ప్రభావంతో గత 48 గంటలుగా తనకు కస్టమర్లు లేకుండా పోయారని, చివరి కస్టమర్ను దించాక గిరాకి కోసం 70 కి.మీ ఖాళీగా తిరిగానని, 48 గంటల తర్వాత మీరే నాకు మొదటి కస్టమర్ అని, ఈరోజైనా ఇంటికి సరుకులు తీసుకెళతానని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడట. అతని బాధ చూసి చలించిపోయిన కాజల్ అతనికి ఇవ్వాల్సిన దానీకంటే 500 రూపాయలు ఎక్కువగానే ఇచ్చిందట.

ఈ విషయాన్నే వివరిస్తూ దయచేసి మీరు ప్రయాణించే క్యాబ్ డ్రైవర్లకు, చిన్న దుకాణాలు పెట్టుకుని ఉన్న వారికి కాస్త ఎక్కువ డబ్బులు ఇవ్వండి. ఎందుకంటే ఆరోజులో మీరే వాళ్లకి చివరి కస్టమర్‌ కావొచ్చు’ అంటూ సలహా ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు