ఫైనల్లీ.. పవన్ కళ్యాణ్ ని చేరిన కాజల్!!

ఫైనల్లీ.. పవన్ కళ్యాణ్ ని చేరిన కాజల్!!

Published on Nov 22, 2015 12:41 AM IST

Pawan-kalyan-kajal
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’. పవన్ కళ్యాణ్ తన తిక్కేంటో చూపించి బాక్స్ ఆఫీసు లెక్కలు తేల్చిన గబ్బర్ సింగ్ పాత్రని మరోసారి ఈ సినిమాతో తెరపైకి తీసుకురానున్నాడు. ఈ చిత్ర టీం ఓ మేజర్ షెడ్యూల్ కోసం ఈ నెల 17న గుజరాత్ వెళ్ళారు. మొదటి మూడు రోజులు పవన్ కళ్యాణ్ పై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసి ఆ షెడ్యూల్ ని ఫినిష్ చేసారు. ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంది.

ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి రెండు నెలలు అయినప్పటికీ ఈ భామ ఇది వరకూ షూటింగ్ లో పాల్గొనలేదు. ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్ షెడ్యూల్లో కాజల్ కూడా జాయిన్ అవుతుందని ఇది వరకే తెలియజేశాం. మేము చెప్పిన దాని ప్రకారం నేటి నుంచి కాజల్ సర్దార్ సెట్లో జాయిన్ అయ్యి సందడి చేస్తోంది. కాజల్ తో పాటు బ్రహ్మానందం కూడా షూట్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం పవన్ – బ్రహ్మి – కాజల్ కాంబినేషన్ లో వచ్చే కొన్ని కొన్ని కామెడీ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. పవర్ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్ ఓ ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించనుంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.

తాజా వార్తలు