కాజల్ ఆశలన్నీ ఆ సినిమాపైనే

Published on Jun 17, 2019 12:00 am IST

‘ఖైదీ నెం 150’ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆ తర్వాత సాలిడ్ హిట్ అందుకోలేకపోయింది. 2018 ఆరంభం నుండి ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తూ వచ్చాయి. నిన్న మొన్న చేసిన ‘సీత’ మీద ఆమె బోలెడు ఆశలు పెట్టుకోగా అది కూడా పరాజయం పొంది నిరుత్సాహానికి గురిచేసింది.

ప్రస్తుతం ఆమె నటించిన సినిమాల్లో ‘రణరంగం’ విడుదలకు రెడీగా ఉంది. శర్వానంద్ ఇందులో హీరో. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 2న రిలీజ్ కానుంది. ఇందులో కాజల్ ప్రధాన కథానాయిక. సినిమాపై పాజిటివ్ బజ్ బాగా ఉండటంతో ఈ చిత్రమైనా తనకు సాలిడ్ బ్రేక్ ఇస్తే బాగుంటుందని కాజల్ ఆశపడుతోంది. మరి ఆమె ఆశల్ని ‘రణరంగం’ నెరవేరుస్తుందో లేదో చూడాలి. ఇకపోతే తమిళంలో ‘పారిస్ పారిస్, కోమలి’ అనే రెండు సినిమాలు చేస్తోంది కాజల్.

సంబంధిత సమాచారం :

X
More