కాజల్ అగర్వాల్ మూడవ హిందీ సినిమాలో నటించడానికి సంతకం చేసినట్టు తెలియజేశారు. గత సంవత్సరం తను అక్షయ్ కుమార్ తో కలిసి ‘స్పెషల్ చబ్బిస్’ సినిమాలో నటించింది. ఈ సినిమా 2013లో విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంది. ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కాజల్ తను మరొక హిందీ సినిమాకి సంతకం చేసినట్టు తెలియజేశారు. అయితే ఆ సినిమా వివరాలను తెలియజేయడానికి ఆమె నిరాకరించారు. ఆమె నటించిన తమిళ సినిమా ‘జిల్లా’ ఈ మధ్య విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్లను వసూలు చేస్తోంది. ‘విజయ్ , మోహన్ లాల్ తో కలిసి ‘జిల్లా’లో నటించడం చాలా ఆనందంగా ఉంది. మేము మంచి సినిమాని నిర్మించాము. మేము పడిన కష్టానికి ప్రజల నుండి మంచి స్పందన లబించింది. వారు మా కష్టాన్ని అర్థం చేసుకున్నారు’ అని అంది. హిందీ సినిమాతో పాటు కాజల్ కృష్ణ వంశీ ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ తో కలిసి నటించనుంది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుండి నిర్వహించే అవకాశం వుంది. అలాగే బాలాజీ మోహన్ సినిమాలో ధనుష్ తో కూడా కాజల్ నటించనుంది.
మరో హిందీ సినిమాకి సంతకం చేసిన కాజల్
మరో హిందీ సినిమాకి సంతకం చేసిన కాజల్
Published on Jan 15, 2014 9:00 PM IST
సంబంధిత సమాచారం
- “మీర్జాపూర్” సినిమా చూడ్డానికి ముందు ఏమన్నా చూడాలా? ట్విస్ట్ ఇచ్చిన ప్రైమ్ వీడియో!
- క్రేజీ కాంబినేషన్.. రమణ గోగుల ఇంట్రెస్టింగ్ పోస్ట్!
- ఇంటర్వ్యూ : హీరో అల్లరి నరేష్ – ‘రంభ ఊర్వశి మేనక’ చూసి ఆడియన్స్ హాయిగా నవ్వుకుంటారు..!
- ‘ఇరుముడి’ సీక్వెల్ లో రామ్ చరణ్? క్లారిటీ ఇచ్చేసిన దర్శకుడు!
- పిక్ టాక్ : ‘రోమాంచకం’ టీమ్‌కు ప్రభాస్ సపోర్ట్..!
- ‘ఓజి 2’ గిఫ్ట్.. పవన్ బర్త్ డేకి అదిరిపోయిన సుజీత్, థమన్ ల సర్ప్రైజ్!
- డబుల్ సెంచరీతో దుమ్ములేపిన ‘ఇరుముడి’.. రవితేజ కెరీర్లోనే టాప్..!
- పిక్ టాక్ : బాబాయ్‌కి మెగా పవర్ బర్త్ డే విషెస్ చెప్పిన రామ్ చరణ్
- రిలీజ్ డేట్‌పై ‘జైలర్ 2’ క్లారిటీ.. అదే ఫిక్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘యేష నాగుల కట్ట’ లోపల ఇంకా చాలా దాచామంటున్న ఆట సందీప్..!
- OTT Release : నెట్‌ఫ్లిక్స్‌లోకి వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’.. సెప్టెంబర్ 4 నుంచి 5 భాషల్లో స్ట్రీమింగ్
- రష్మిక మందన్న ‘మైసా’ కొత్త పోస్టర్.. రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్
- డైలమాలో రజినీకాంత్ ‘జైలర్ 2’.. రిలీజ్ విషయంలో అయోమయం.. కారణం ఇదేనా..?
- బాలయ్య-నాగార్జున.. ఈసారైనా ఆ ఫీట్ సాధిస్తారా..?
- ‘వారణాసి’ ఆ విషయంలో తొందర పడటం లేదు..?
- ‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ సాలిడ్ అప్డేట్..!
- సెప్టెంబర్ మూవీ బాక్సాఫీస్ హంగామా : ఈ నెలలో రాబోతున్న టాప్ సినిమాలు ఇవే!


