కాజల్ బాద్షా ఆడియోకి రాకపోవడానికి గల కారణం ఇదేనా?

కాజల్ బాద్షా ఆడియోకి రాకపోవడానికి గల కారణం ఇదేనా?

Published on Mar 17, 2013 8:30 PM IST

Kajal-Agarwal

అందాల భామ కాజల్ అగర్వాల్ ‘బాద్షా’ ఆడియో వేడుకకి హాజరు కాలేదు. ఎందుకు రాలేక పోయింది అనే విషయాన్ని ఆమె తన పేస్ బుక్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం కాజల్ కార్తీ తో నటిస్తున్న ‘ఆల్ ఇన్ అల్ అజగు రాజ’ సినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. కాజల్ ‘బాద్షా’ ఆడియో లాంచ్ కోసం కోయంబత్తూర్ నుండి హైదరాబాద్ కి రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చివరి నిమిషంలో కాజల్ మర్చిపోలేని ఓ సంఘటన జరిగింది.

ఆ విషయాలను చెబుతూ ‘ ఇప్పుడే హైదరాబాద్ కి రావాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యింది. బాద్షా ఆడియో ఫంక్షన్ కి రావాలని ఎంతో ఆసక్తి గా ఉన్నాను. పొల్లాచ్చి నుండి బయలుదేరి ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాను. కానీ స్పైస్ జెట్ సిబ్బంది నాతో చాలా బాడ్ గా బిహేవ్ చేసారు. నాకు ముందుగానే ఫ్లైట్ లోకి వెళ్ళడానికి అడ్వాన్స్ బోర్డింగ్ పాస్ ఉన్నప్పటికీ నన్ను లోపలి పంపలేదు అలాగే నా లగేజ్ ని కూడా చెక్ చెయ్యలేదు. కోయంబత్తూర్ ఎయిర్ పోర్ట్ లో ఇలాంటి అనుభవం ఎదురవుతుందని అనుకోలేదు, చాలా అసంతృప్తికి గురయ్యానని’ కాజల్ పోస్ట్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు