
కాజల్ అగర్వాల్, ప్రియా ఆనంద్.. ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యాడు విక్రమ్. ‘ఆరిమ నంబి’ ఫేం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించబోయే సినిమాలో కాజల్, ప్రియాలను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. జూన్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. విక్రమ్ క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని, అతను మాత్రమే నటించగలడని దర్శకుడు తెలిపారు.
‘ఐ’ సినిమాకు రెండేళ్ళ విలువైన సమయాన్ని కేటాయించిన విక్రమ్, ఇక నుండి త్వరగా సినిమాలను పూర్తి చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ’10 ఎణ్రదుకుళ్ల’ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. సమంత ఈ సినిమాలో హీరోయిన్. ఛార్మి ఐటెం సాంగులో నటించింది. ఇది కాకుండా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరో సినిమాను అంగీకరించారు. ఈ ఏడాది మినిమం రెండు సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నాడు విక్రమ్.

