వైరల్ అవుతున్న కాజల్ బోల్డ్ లుక్

వైరల్ అవుతున్న కాజల్ బోల్డ్ లుక్

Published on Apr 3, 2023 1:18 PM IST

Kajal 1

హీరోయిన్ కాజల్ అగర్వాల్ క్రేజ్ అండ్ ఫాలోయింగ్ సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపోయినా.. కాజల్ స్టార్ డమ్ ఏ మాత్రం తగ్గలేదు. ఐతే, ఇన్నాళ్లు కాజల్ అగర్వాల్ తన కొడుకుతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ వచ్చింది. అయితే, గత కొన్ని రోజుల నుంచి కాజల్ తన రూట్ మార్చింది. మళ్లీ గ్లామర్ బాట పట్టింది. పైగా భర్త గౌతమ్ కిచ్‌లు తో కలిసి ఫోటో షూట్లు చేస్తోంది. తాజాగా కాజల్ అగర్వాల్ చేసిన ఓ హాట్ ఫోటో షూట్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.

నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఆరంభ వేడుకకు హాజరైన కాజల్ అగర్వాల్ చాలా బోల్డ్ లుక్ లో దర్శనం ఇచ్చింది. పైగా ఆ ఫొటోను కాజల్ నెట్టింట పంచుకుంది. దాంతో ఈ ఫొటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మొత్తానికి 37 సంవత్సరాల కాజల్ అగర్వాల్ గృహిణి బాధ్యతలకే పరిమితం కాకుండా.. వరుసగా సినిమాలు చేస్తూ ఫాన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి ఇలా బాగానే బాగానే కసరత్తులు చేస్తోంది.

తాజా వార్తలు