మొదలైన కార్తీ – కాజల్ మూవీ షూటింగ్

మొదలైన కార్తీ – కాజల్ మూవీ షూటింగ్

Published on Mar 17, 2013 8:25 PM IST

Kajal-Karthi

కార్తీ – కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘నా పేరు శివ’ సినిమాలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఆ సినిమాలో వీరిద్దరి జోడీకి మంచి రెస్పాన్స్ రావడంతో వీరిద్దరితో బ్రు కాఫీ యాడ్ చేసారు. మరో కొత్త యాడ్ ని కూడా షూట్ చేసారు. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ వీరిద్దరూ ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో కనిపించనున్నారు. తమిళ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘ఆల్ ఇన్ ఆల్ అజుగు రాజ’ అనే టైటిల్ ని పెట్టారు. ఎమ్. రాజేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం కాజల్ ఈ సినిమా టీంతో కలిసి పని చేస్తున్నారు, అలాగే ఈ సినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది.

ఇవి కాకుండా తమిళ్ హీరో విజయ్ సరసన ‘జిల్లా’ సినిమాలో నటించనుంది, అలాగే రామ్ చరణ్ ఎవడు సినిమాలో ప్రత్యెక పాత్రలో కనిపించనుంది. ఇవన్నీ కాకుండా ‘బాద్షా’ సినిమాలో ఆమె లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు