బాలీవుడ్, కోలీవుడ్ లలో బిజీబిజీగా కాజల్

kajal-agarwal
తారక్ తో కలిసి టెంపర్ సినిమాలో నటించిన కాజల్ ఆ విజయం తరువాత మరో టాలీవుడ్ సినిమా విడుదలకాలేదు. ఆ తరువాత పలు తమిళ, హిందీ ప్రాజెక్ట్ లను అంగీకరించింది. రందీప్ హూడా ప్రధాన పాత్రలో నటించిన చిత్రాన్ని అధిక శాతం మలేసియాలో చిత్రీకరించారు.

తాజా సమాచారం ప్రకారం ఈ హిందీ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. దీపక్ టిజోరీ దర్శకుడు.

కాజల్ నటించిన తాజా చిత్రం మారి సినిమా గత శుక్రవారం విడుదలైంది. విశాల్ సరసన మరో తమిళ చిత్రంలో నాయికగా నటిస్తుంది. కాజల్ ఇటీవలే బ్రహ్మోత్సవం సినిమాలో ఒక నాయిక పాత్ర దక్కించుకుంది.

Exit mobile version