గత కొన్ని రోజులుగా పూరి – ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రంపై పలు పుకార్లు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రని కాజల్ ని సంప్రదించినట్టు కానీ కాజల్ నటించడానికి అంగీకారం తెలుపనట్టు ఎవరికి నచ్చిన వార్తలు వాళ్ళు రాసేస్కున్నారు. అయితే ఇప్పుడు ఈ పుకార్లన్నింటికి అడ్డుకట్ట వేస్తూ ఈ సినిమాను నిర్మించనున్న బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేశాడు
కాజల్ మా సినిమాలో నటిస్తుందని. పూరి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ కు జంటగా తప్పకుండా కనిపిస్తుందని తెలిపాడు. ఈ సినిమాకు వక్కంతం వంశీ కధను అందిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదలచేసే యోచనలో వున్నారు


