సీనియర్ హీరోకి నో చెప్పిన కాజల్ !

kajal3

సీనియర్ హీరో డా. రాజశేఖర్ గత ఏడాది ‘గరుడ వేగ ‘సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఈ చిత్రం తరువాత రాజశేఖర్ వరుసగా 4చిత్రాల్లో నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ అందులో ఒక్క చిత్రం కూడా ఫైనల్ కాలేదు. ఇక ఎట్టకేలకు ఇప్పుడు ఆయన ‘అవె’ ఫెమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న ఈచిత్రంలో నటించనున్నాడు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈచిత్రంలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు .

ఈచిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ప్రముఖ నటి కాజల్ ను సంప్రదించారట. కానీ ప్రస్తుతం కాజల్ యువ హీరోలతో నటిస్తూ బిజీగా ఉండడం వల్ల ఈ సీనియర్ హీరో తో నటించడానికి నో చెప్పిందని చిత్ర వర్గాల నుండి సమాచారం వస్తుంది. మరి ఈ చిత్రం లో రాజశేఖర్ కు జోడిగా ఎవరిని తిసుకుంటారో చూడాలి. ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హిందీ ‘క్వీన్’ చిత్రం ను తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మి’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈచిత్రాన్ని పూర్తి చేసి త్వరలోనే రాజశేఖర్ తో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు.

Exit mobile version