‘పక్కా లోకల్’ పాట గురించి కాజల్ ఏమన్నారంటే..!

kajal
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారెజ్’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఇక సెప్టెంబర్ 2న విడుదలవుతుందంటూ నిన్నటివరకూ ప్రచారం పొందిన ఈ సినిమాను, ఒకరోజు ముందే (సెప్టెంబర్ 1న) విడుదల చేయనున్నట్లు నిన్న టీమ్ ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత ఎక్కువైంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ‘పక్కా లోకల్’ అనే ఐటెమ్ సాంగ్‌లో కనిపించనున్న కాజల్, సినిమా గురించి మాట్లాడుతూ ఈ ఎనర్జిటిక్ నెంబర్‌లో తారక్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని తెలిపారు.

సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమాలో తన పాట అందరినీ ఆకట్టుకుంటుందని, సినిమా విడుదల కోసం తానూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా ఆయన గత రెండు చిత్రాల్లానే సోషల్ మెసేజ్‌తో కూడిన కమర్షియల్ సినిమాగా ప్రచారం పొందుతోంది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.