రవితేజ సరసన నటించనున్న కాజల్ ?

ఒకప్పుడు వరుసగా విజయవంతమైన సినిమాలు తీసిన శ్రీనువైట్ల ఈమధ్య ఆయన తీసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఈసారి ఆయన ఎలాగైనా హిట్ సినిమా చెయ్యాలనే దృక్పధంతో రవితేజతో సినిమా చెయ్యబోతున్నాడు. తమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా ఏప్రిల్ నుండి ప్రారంభం కాబోతోంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ సినిమా లో కాజల్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్న శ్రీను వైట్ల ఈ సినిమా విశేషాలు త్వరలో మీడియాతో పంచుకొనున్నారు. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే టైటిల్ ఫిక్స్ చేయబడిన ఈ సినిమాలో మాస్ మహారాజ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’ ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.