నాగ్ సినిమాలో కాజల్ ఇంట్రెస్టింగ్ రోల్ లో.!

Published on Mar 20, 2021 5:30 pm IST

మన టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హంక్ అక్కినేని నాగార్జున ఇప్పుడు ఇంట్రెస్టింగ్ లైనప్ తో మళ్ళీ బిజీగా ఉన్నారు. ఒక పక్క ఫ్యామిలీ సబ్జెక్టులతో పాటుగా ఆసక్తికర థ్రిల్లర్స్ ను కూడా ఇప్పుడు నాగ్ చేస్తున్నారు. మరి లేటెస్ట్ గా “వైల్డ్ డాగ్” తో రెడీగా ఉన్న నాగ్ ఇది లైన్ లో ఉండగానే టాలెంటెడ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో కూడా ఒక ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ఓకే చేసిన సంగతి తెలిసిందే.

మరి అలాగే ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు మేకర్స్ కూడా మొన్ననే కన్ఫర్మ్ చేసారు. మరి ఈమె చేస్తున్న రోల్ కు సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రంలో కాజల్ ఒక్క గ్లామరస్ రోల్ గా కాకుండా ఒక రా(ఆర్ ఏ డబ్ల్యూ) ఏజెంట్ గా కనిపించనుందట.

మరి ఆ రోల్ కు సంబంధించిన ట్రైనింగ్ ను కూడా కాజల్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని శరత్ మరార్ మరియు రామ్మోహనరావులు నిర్మాణం వహిస్తుండగా మేకర్స్ ఇది నాగ్ కెరీర్ లో ఒక బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :