
కాజల్ అగర్వాల్ నటించిన ‘స్పెషల్ 26’ సినిమా వచ్చి సంవత్సర కాలం దాటినా తర్వాత కాజల్ హిందీలో మరో సినిమాకి సైన్ చేసింది. హిందీలోకి రిమేక్ చేస్తున్న ‘సీస్ ఫైర్’ అనే ఇరానీ చిత్రంలో శర్మన్ జోషితో కాజోల్ జత కట్టనుంది.
ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అజోయ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్ళైన ఇద్దరు విడాకులు తీసుకున్న తరువాత మళ్ళీ ప్రేమ లో ఎలా పడ్డారు అన్న అంశం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. కాజోల్ దక్షిణాదిన నటించే చిత్రాల పట్ల పెద్దగా ఆసక్తి చూపటం లేదు.
ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘గోవిందుడు అందరి వాడెలే’ చిత్రంలో, ధనుష్ తో కలిసి మరో తమిళ చిత్రంలో కాజోల్ నటిస్తోంది. తాజా షెడ్యూల్ ప్రకారం గోవిందుడు అందరివాడేలే చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటోంది. నానాక్రంగూడలో ఈ చిత్రం కోసం భారీ సెట్టింగ్ ను వేశారు. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.

