అలా కుదరకపోతే ఇలానైనా చూడండి అంటున్న కాజల్.

Published on Jun 24, 2019 1:44 pm IST

బెల్లంకొండ శ్రీనివాస్,కాజల్ కాంబినేషన్ లో తేజా దర్శకత్వంలో కొద్దిరోజుల క్రితం విడుదలైన “సీత” ఆశించినంత విజయం సాధించలేదు. కానీ ఈ మూవీలో స్వార్ధం కలిగిన తలబిరుసు అమ్మాయి పాత్రలో కాజల్ నటనకి మంచి మార్కులు పడ్డాయి.దర్శకుడు తేజా,హీరో బెల్లంకొండ కంటే ప్రాధాన్యం ఉండేలా సీతగా కాజల్ పాత్రను తెరకెక్కించాడు. ఐతే ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో అందుబాటులోకి వచ్చింది.

దీనితో కాజల్ సినిమా థియేటర్లలో మూవీ చూడనివారు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో “సీత” మూవీ చూడండి అంటూ ప్రేక్షకులను కోరుతున్నట్లుగా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో సందేశంతో పాటు, ఆ మూవీ అమెజాన్ లింక్ ని పోస్ట్ చేశారు. నేను చాలా బాగా చేశాను మిస్సయితే ఒకసారి నా నటన చూడండి అని అభ్యర్థిస్తున్నట్లు ఉంది అమ్మడి పోస్ట్ చూస్తుంటే. ప్రస్తుతం కాజల్ ‘క్వీన్’ మూవీ తమిళ రీమేక్ “పారిస్ పారిస్”,జయం రవి సరసన “కోమలి”,శర్వానంద్ తో “రణరంగం”చిత్రాలలో నటిస్తుంది. తేజా దర్శకత్వంలో ఓ లేడి ఓరియెంటెడ్ మూవీ లో కూడా కాజల్ చేయనుందని టాక్.

సంబంధిత సమాచారం :

X
More