యువ హీరోతో మరో ప్రాజెక్ట్ ఓకే చేసిన కాజల్ ?

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాల వేగం పెంచారు. చక చకా స్క్రిప్ట్స్ ఓకే చేసేస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఆమె యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీనివాస్ తో కలిసి నూతన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి సినిమాలో నటిస్తున్న కాజల్ ఆయనతో మరొక సినిమాకు ఓకే చెప్పడం విశేషం.

ఈ చిత్రాన్ని తేజ డైరెక్ట్ చేయనున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ను దృష్టిలో పెట్టుకుని ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను రాసిన తేజ అందులో కాజల్ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించారట. కాజల్ కూడ కథను నమ్మి తేజకు మాటిచ్చారట. అనిల్ సుంకర నిర్మించబోయే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తారట.