ఆసక్తికరమైన పాత్రలో నటిస్తున్న కాజల్ !

ఆసక్తికరమైన పాత్రలో నటిస్తున్న కాజల్ !

Published on Aug 11, 2018 1:45 PM IST

kajal3

సీనియర్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ యువ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపొయింది. దాంట్లో భాగంగా ‘స్వామి రారా’ ఫెమ్ సుధీర్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కాజల్ యువ హీరో శర్వానంద్ కు జోడిగా నటిస్తుంది.

ఈ చిత్రంలో ఆమె డాక్టర్ పాత్రలో నటిస్తుంది. ఈ పాత్రలో నటించడం కాజల్ ఇదే మొదటి సారి. శర్వానంద్ ద్విపాత్రిభినయం చేస్తున్న ఈ చిత్రంలో ‘హలో’ ఫెమ్ కళ్యాణి ప్రియదర్శన్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ పిళ్లై సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు