మరోసారి రవితేజతో రొమాన్స్ చేయనున్న కాజల్ ?

14th, November 2017 - 08:33:45 AM

ఇటీవలే ‘రాజా ది గ్రేట్; తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న హీరో రవితేజ తనకు ‘దుబాయ్ శీను’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీనువైట్లతో త్వరలోనే ఒక సినిమా చేయనున్నాడు. వరుస పరాజయాల్లో ఉన్న శ్రీనువైట్ల కూడా రవితేజతో చేయబోయే సినిమాతో సక్సెస్ అందుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రంలో రవితేజ సరసన కాజల్ అగర్వాల్ నటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాజల్ గతంలో రవితేజతో ‘వీర, సారొచ్చారు’ వంటి చిత్రాల్లో నటించగా శ్రీనివైటల్ దర్శకత్వంలో ‘బాద్షా’ చేశారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.