అందరినీ ఓటు వేయమన్న కాజల్ అగర్వాల్

అందరినీ ఓటు వేయమన్న కాజల్ అగర్వాల్

Published on May 7, 2014 8:30 AM IST

kajal-agarwalkajal-agarwal
ఈ రోజు సీమాంధ్ర ప్రాంతంతో పాటు, దేశ వ్యాప్తంగా చివరి దశ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అందాల భామ కాజల్ అగర్వాల్ అందరినీ ఓటు వేయమని అంటోంది. అలాగే కాజల్ ఒక్క ఓటు కూడా వృధా కాకూడదని అంటోంది.

‘ప్రతి ఒక్కరి ఓటు కౌంట్ అవుతుంది. మీ చుట్టూ జరుగుతున్న సమస్యలను ఎదుర్కోవడానికి అందరూ వెళ్లి ఓటు వేయండి. వేడికి బయపది ఓటు వేయడం మానేయకండని’ ఆమె తెలిపింది.

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో కాజల్ చాలా సాంప్రదాయబద్దమైన పాత్రలో కనిపించనుంది.

కాజల్ చెప్పింది మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ మరి ఇంకా ఎందుకు ఆలస్యం వెళ్లి మీ ఓటు హక్కును వినియోగించుకోండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు