విక్రమ్ సినిమా కోసం సిద్ధమైన కాజల్!

విక్రమ్ సినిమా కోసం సిద్ధమైన కాజల్!

Published on Apr 22, 2015 8:50 PM IST

kajal-vikram
తెలుగులో స్టార్లందరితోనూ ఆడిపాడిన కాజల్ అగర్వాల్.. ఇప్పుడు తమిళ సినిమాలతో దూసుకుపోతోంది. కాజల్ హీరోయిన్‌గా ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో రెండు ధనుష్, విశాల్‌ల సినిమాలు కాగా మూడోది విక్రమ్‌ సినిమా. ఇప్పటికే ధనుష్, విశాల్ సినిమాలు సెట్స్‌పై ఉండగా తాజాగా విక్రమ్ సినిమా కూడా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.

మురుగదాస్ శిష్యుడు ఆనంద్ శంకర్ విక్రమ్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు ‘మర్మ మణితన్’ (ఎవరికీ అర్థం కాని మనిషి) అనే ఆసక్తికర టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ త్వరలోనే మలేషియాలో మొదలుకానుంది. విక్రమ్‌తో నటించడం విషయంలో కాజల్ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ సినిమాలో విక్రమ్ డ్యూయల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. కలైపులి థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు