హర్రర్ డ్రామా ‘కాకి’ రిలీజ్ డేట్ ఫిక్స్

kaki
అర్పిత క్రియేషన్స్ పతాకంపై కిరణ్ పత్తికొండ నిర్మాణంలో రూపొందుతోన్న హర్రర్ సినిమా ‘కాకి’. అశోక్ కుమార్, కిరణ్ పత్తికొండ, మేఘా శ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మనోన్.యం. దర్శకత్వం వహించారు. కేవలం 45రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ 12న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాతలు ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియజేశారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘కాకి’ సినిమా షూటింగ్‌ను కేవలం 45 రోజుల్లోనే పకడ్బందీగా పూర్తి చేశామని, 10రోజుల పాటు డే అండ్ నైట్ షూటింగ్‌ను కూడా టీమ్ ఎంజాయ్ చేస్తూ చేసిందని తెలిపారు. అన్ని పనులనూ పూర్తి చేసుకున్న సినిమాను ఈనెల 12న విడుదల చేయనున్నామని, పూర్తి హర్రర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2 గంటల 10 నిమిషాల నిడివితో ఒకే ఒక్క పాటతో, ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉంటుందని తెలిపారు. ఇక హర్రర్ సినిమా ప్రియులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని దర్శకుడు ఈ సందర్భంగా తెలియజేశారు.

Exit mobile version