తారక్ సినిమాకు స్కోర్ చెయ్యడమే బిగ్ డ్రీం – కాల భైరవ

Published on Mar 26, 2021 10:15 am IST

మన టాలీవుడ్ లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి తనయులు శ్రీ సింహా మరియు కాల భైరవలు తమ తమ టాలెంట్ తో తెలుగులో పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలు చేస్తూ వస్తున్నారు. “మత్తు వదలరా” సినిమాతో పూర్తి స్థాయి సినీ కెరీర్ ను ఆరంభించిన వీరు ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నారు. అదే “తెల్లవారితే గురువారం”.

మరి ఈ చిత్రం రేపు విడుదల సందర్భంగా యువ సంగీత దర్శకుడు కాల భైరవ ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. తన సోదరుడితో ఈ రెండు కాకుండా మూడో సినిమా కూడా నేనే చేస్తున్నాని తెలిపాడు. మరి అలాగే తమ ఇద్దరికీ కూడా రాజమౌళి ఎప్పటి నుంచో మంచి ఇన్ పుట్స్ ఇస్తున్నారని మేము కూడా తన సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటామని తెలిపాడు.

మరి అలాగే తారక్ తో అయితే ఎప్పటి నుంచో తమకు తమ కుటుంబానికి ఎమోషనల్ బంధం ఉందని ఎన్టీఆర్ తమకి అయితే పెద్దన్నయ్య లాంటి వాడు అని భైరవ తెలిపాడు. అంతే కాకుండా తారక్ సినిమాకు సంగీతం అందించడం అనేది నాకు బిగ్గెస్ట్ డ్రీమ్ అని ఈ యువ సంగీత దర్శకుడు తన కోరికను వెలిబుచ్చాడు.

సంబంధిత సమాచారం :