హైయెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టిన బాలీవుడ్ మూవీ !

Published on Apr 18, 2019 5:01 pm IST

వరుణ్ ధావన్ , అలియా భట్ నాల్గవ సారి జంటగా నటించిన తాజా చిత్రం కళాంక్. భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ చిత్రం మిక్సడ్ రివ్యూస్ ను తెచ్చుకుంది.అయితే కల్లెక్షన్స్ లో మాత్రం సత్తాచాటింది. మొదటి రోజు ఈ చిత్రం దేశ వ్యాప్తంగా 21.6 కోట్ల షేర్ ను రాబట్టి ఈఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు సృష్టించింది.

ఇంతకుముందు అక్షయ్ కుమార్, కేసరి 21.06 కోట్ల షేర్ తో మొదటి స్థానంలో ఉండగా తాజాగా కళాంక్ ఆ రికార్డు ను బ్రేక్ చేసింది. అభిషేక్ వర్మన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సంజయ్ దత్ , ఆదిత్య రాయ్ కపూర్ , మాధురి దీక్షిత్ , సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :