నైజాంలో “కల్కి” డే 6 వసూళ్లు

నైజాంలో “కల్కి” డే 6 వసూళ్లు

Published on Jul 3, 2024 8:59 AM IST


రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “కల్కి 2898 ఎడి”. మరి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రంలో ప్రభాస్ సహా దీపికా పడుకోణ్, దిశా పటాని అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి బిగ్ స్టార్స్ నటించగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కించాడు.

ఇక ఈ చిత్రం అయితే ఇప్పుడు భారీ వసూళ్లు అందుకొని దూసుకెళ్తుండగా నైజాం మార్కెట్ సంబంధించి లేటెస్ట్ వసూళ్ల డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఇక ఈ చిత్రం 6 రోజుల రన్ ని పూర్తి చేసుకోగా నైజాంలో డే 6 కి గాను 3.65 కోట్ల షేర్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది.

దీనితో మొత్తం 6 రోజుల్లో కల్కి 54 కోట్ల దగ్గర షేర్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతానికి రన్ బాగానే కంటిన్యూ అవుతుండగా లాంగ్ రన్ లో సినిమా ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు