నార్త్ అమెరికాలో ఆగ‌ని ‘క‌ల్కి’ ప్ర‌భంజ‌నం

నార్త్ అమెరికాలో ఆగ‌ని ‘క‌ల్కి’ ప్ర‌భంజ‌నం

Published on Jul 2, 2024 11:24 AM IST

టాలీవుడ్ లో తెర‌కెక్కిన మాగ్న‌మ్ ఒప‌స్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మైథాల‌జీ సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా తెర‌కెక్కించిన తీరు అత్య‌ద్భుతంగా ఉండ‌టంతో ప్రేక్ష‌కులు ఈ సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. కేవ‌లం ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్దే కాకుండా ఓవ‌ర్సీస్ లోనూ క‌ల్కి ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది.

ఈ సినిమా నార్త్ అమెరికా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇప్ప‌టికే నార్త్ అమెరికాలో ప‌లు కొత్త రికార్డులు క్రియేట్ చేసిన క‌ల్కి, తాజాగా మ‌రో రికార్డు సృష్టించింది. నార్త్ అమెరికాలో అతి త‌క్కువ టైంలో రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించిన ఇండియ‌న్ చిత్రంగా క‌ల్కి నిలిచింది.

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త‌న రాకింగ్ ప‌ర్ఫార్మెన్స్ తో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌గా, నాగ్ అశ్విన్ టేకింగ్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. అమితాబ్ బచ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని వంటి స్టార్స్ ఈ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం ఈ సినిమాకు మ‌రో అసెట్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు