రిలీజ్ కి రెడీ అయిన ‘కల్కి’ హానెస్ట్ ట్రైలర్ !

రిలీజ్ కి రెడీ అయిన ‘కల్కి’ హానెస్ట్ ట్రైలర్ !

Published on Jun 25, 2019 3:00 AM IST

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కల్కి’. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. కాగా హైదరాబాద్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రశాంత్ వర్మ ‘కల్కి’ హానెస్ట్ ట్రైలర్ విడుదల చేశారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా నిన్న కార్యక్రమంలో ట్రైలర్ ను విడుదల చేయలేదు. ఈ రోజు ఉదయం 10 గంటలకు కల్కి హానెస్ట్ ట్రైలర్ విడుదల కానుంది.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్, ‘హార్న్ ఓకే ప్లీజ్’, ‘ఎవరో ఎవరో’ పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

వైవిధ్యమైన కథతో యాక్షన్ ఎంటర్టైనెర్ గా రాబోతున్న ఈ సినిమాలో నందిత శ్వేతా, ఆదా శర్మ, రాహుల్ రామకృష్ణ, పూజిత పొన్నాడ, నాజర్, సిద్ధూ, జొన్నలగడ్డ, శత్రు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, రాజశేజర్ కూతుళ్లు శివాని , శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు