ట్యాలెంట్ ఉన్నవారికి ‘కల్కి’ మేకర్స్ బంపర్ ఆఫర్..!

ట్యాలెంట్ ఉన్నవారికి ‘కల్కి’ మేకర్స్ బంపర్ ఆఫర్..!

Published on Aug 10, 2026 6:00 PM IST

ప్రెస్టీజియస్ వైజయంతీ మూవీస్ రూపొందించిన ‘కల్కి 2898 AD’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ క్యాస్టింగ్‌తో రూపొందిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు.

అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ అదిరిపోయే న్యూ్స్ చెప్పారు. ఈ సీక్వెల్ మూవీలో నటించే గోల్డెన్ ఛాన్స్ అందిస్తూ అధికారిక కాస్టింగ్ కాల్ ప్రకటించారు. నటనపై ఆసక్తి, ప్రతిభ ఉన్నవారికి ఎలాంటి షరతులు లేకుండా బిగ్ స్క్రీన్ పై కనిపించే ఛాన్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకునే నటీనటులు తమ వివరాలను, పోర్ట్‌ఫోలియోలను kalkiuniversecasting@gmail.com అనే ఈమెయిల్ ఐడీకి పంపవచ్చని వైజయంతీ మూవీస్ ప్రకటనలో పేర్కొంది. వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే నూతన నటీనటులకు ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

తాజా వార్తలు