“కల్కి” హిందీ లేటెస్ట్ వసూళ్లు ఇవే!

“కల్కి” హిందీ లేటెస్ట్ వసూళ్లు ఇవే!

Published on Jul 7, 2024 5:23 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభంజనం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుంది. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898ఎడి చిత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకు పోతుంది. ఈ చిత్రం 1000 కోట్ల రూపాయల క్లబ్ లో త్వరలో చేరనుంది. ఈ చిత్రం హిందీ వెర్షన్ లో కూడా సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. నార్త్ ఇండియా లో ఈ చిత్రం శనివారం రోజున 17.50 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. దీంతో ఈ చిత్రం ఇప్పటి వరకూ అక్కడ 190 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈరోజు ఆదివారం కావడంతో, ఈరోజు కూడా నంబర్ భారీగానే ఉండే అవకాశం ఉంది.

అయితే ఈ చిత్రం హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ చిత్రం వసూళ్లను బీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైటర్ చిత్రం లాంగ్ రన్ లో దాదాపు 215 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. కల్కి చిత్రానికి ఇది ఈజీ టార్గెట్ అని చెప్పాలి. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం గా హిందీలో నిలిచే అవకాశం ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు