రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రం రిలీజ్ ట్రైలర్ పై మేకర్స్ తాజాగా ఒక ప్రకటన చేయడం జరిగింది. రేపు సాయంత్రం 6:00 గంటలకు రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, పశుపతి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
Prepare for the Future!!!
The Release Trailer of #Kalki2898AD out Tomorrow at 6 PM.@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/U0DsBTmEoq
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 20, 2024