కల్కి టీజర్ విడుదల !

Published on Feb 4, 2019 12:49 pm IST

‘గరుడ వేగ’ తో సూపర్ హిట్ కొట్టిన సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి’. అవె ఫెమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈరోజు ఈచిత్రం యొక్క టీజర్ ను విడుదలచేశారు. 1983లో జరిగిన మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతున్నఈచిత్రంలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, రాజశేజర్ కూతుళ్లు శివాని , శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాశరథి శివేంద్ర ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అయితే ఈచిత్రానికి ఇంకా హీరోయిన్ ను ఎంపిక చేయాల్సివుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :