700 కోట్లతో దూసుకు పోతున్న “కల్కి”

700 కోట్లతో దూసుకు పోతున్న “కల్కి”

Published on Jul 3, 2024 8:51 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కొస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఎడి చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకు పోతుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకూ 700 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. కల్కి చిత్రం డ్రీమ్ రన్ ను కంటిన్యూ చేస్తోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే, దిశా పటాని లు ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించగా, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ అధ్బుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు