‘విజేత’ పాటలు సూపర్బ్ గా వస్తున్నాయట
Published on Jun 6, 2018 8:23 am IST

త్వరలో మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్న సంగతి తెలిసిందే. ఈయన వెండి తెర ఎంట్రీ కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రిగారు ఈ చిత్రానికి పాటల్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో చాలా బాగా వస్తోందని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రాకేష్ శశి డైరెక్ట్ చేస్తున్నాడు. జూలై నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook