టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న చిరు అల్లుడి సినిమా !

Published on May 31, 2018 11:33 am IST

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘విజేత’. నూతన దర్శకుడు రాకేష్ శశి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేసుకుంది. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలై కళ్యాణ్ దేవ్ తన పాత్ర తాలూకు డబ్బింగ్ కూడ కానిస్తున్నారు.

మెగాస్టార్ పాత చిత్రం ‘విజేత’ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పట్ల మెగా అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని జూలై నెలలో విడుదలచేయనున్నారు దర్శక నిర్మాతలు. ప్రముఖ సినిమాట్రోగ్రఫర్ సెంథిల్ కుమార్ కెమెరా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు నాజర్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :