సేఫ్ ప్రాజెక్ట్ తో బరిలోకి దిగుతున్న చిరు అల్లుడు !
Published on Jun 12, 2018 9:36 am IST

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ అనే సినిమా ద్వారా వెండి తెర ఆరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. మాస్ బ్యాక్ డ్రాప్ ఉన్న మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కళ్యాణ్ దేవ్ ఎలాంటి సినిమాతో బరిలోకి దిగుతాడో చూడాలని మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

కొద్దిసేపటి క్రితమే విడుదలైన చిత్ర టీజర్ చూస్తే సినిమా పెద్ద హెవీగా లేకుండా ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాంటిక్ ఎలిమెంట్స్, కొంత సోషల్ అవేర్నెస్ కలిగి అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన రీతిలో ఉంటుందని తెలుస్తోంది. దీన్నిబట్టి కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాతోనే స్టార్ డమ్ ఏర్పరచుకోవాలనే ఉద్దేశ్యంతో కాకుండా నటుడిగా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్నారని స్పష్టమవుతోంది.

జూలై నెలలో విడుదలకానున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ శశి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో దేవ్ కు జోడీగా మాళవిక నాయర్ నటిస్తోంది.

టీజర్ కొరకు క్లిక్ చేయండి :

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook