జూలైలో ఎంట్రీ ఇవ్వనున్న మెగాస్టార్ అల్లుడు !

జూలైలో ఎంట్రీ ఇవ్వనున్న మెగాస్టార్ అల్లుడు !

Published on May 26, 2018 4:00 PM IST

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి 5గురు యువ హీరోలు పరిశ్రమలో ఉండగా ఇప్పుడు 6వ హీరో కూడ ఏంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయనే చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్. నూతన దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో ఆయన చేస్తునం మొదటి చిత్రం ‘విజేత’. వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దేవ్ ను వెండి తెరకు పరిచేయం చేయనున్నారు.

చిరు సూపర్ హిట్ సినిమా టైటిల్ తో వస్తున్న ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ నెలకొంది. కొద్దిసేపటి క్రితమే సినిమాలో దేవ్ లుక్ ను విడుదలచేశారు. ఆ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రాన్ని జూలై నెలలో విడుదలచేయనున్నారు దర్శక నిర్మాతలు. ప్రముఖ సినిమాట్రోగ్రఫర్ సెంథిల్ కుమార్ కెమెరా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు