2016 లో అక్కినేని నాగార్జున ద్వి పాత్రాభినయంలో కళ్యాణ్ కృష్ణ తెరకేకించిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది . అయితే దీనికి కొనసాగింపుగా ‘బంగార్రాజు’ చిత్రం తెరకెక్కిస్తారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల నాగార్జున కూడా ఆ చిత్రం ఉంటుందని చెప్పారు కానీ ఎప్పుడు మొదలువుతుందో తెలియదని అన్నారు. ఇప్పుడు తాజాగా చిత్ర డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఒక ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ అయిపోయిందని ఈ చిత్ర టైటిల్ ‘బంగార్రాజు’ అని నాగార్జున హీరోగా స్వీయ నిర్మాణంలో ఈ సినిమా అతి త్వరలో స్టార్ట్ కానుందని అయన వెల్లడించారు .
ప్రస్తుతం నాగార్జున శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న సినిమాలో నాని తో కలిసి నటిస్తున్నాడు. ఇటీవల నాగ్ నటించిన ‘ఆఫీసర్’ చిత్రం ఎంతపెద్ద డిజాస్టర్ అయిందో అందరికి తెలిసిందే . ఇక అటు కళ్యాణ్ కృష్ణ కూడా నేల టిక్కెట్టు సినిమా తో భారీ పరాజయాన్ని మూట గట్టుకున్నారు. మరి వీరిద్దరి కలయికలో రానున్న బంగార్రాజు చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి .


