‘పటాస్’ సినిమాలో చిత్రీకరణ చాలా బాగుందని నందమూరి కళ్యాణ్ రామ్ ఆనందంలో వున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద వున్న సినిమా విశేషాలని కళ్యాణ్ తన అఫీషియల్ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలిపాడు
” నా కొత్త సినిమా ‘పటాస్’ షూటింగ్ లో బిజీగా వున్నాను. పాత్ర చిత్రీకరణ చాలా బాగుంది” అని పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.
‘కందిరీగ’ సినిమాకు రచయితగా పనిచేసిన అనీల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ అయిన ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది


