కళ్యాణ్ రామ్ సంపత్ నందితో కూడా !

Published on Jun 21, 2019 3:00 am IST

రామ్ చరణ్ తో ‘రచ్చ’ సినిమా తీసిన సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా ఓ సినిమా చేయాలనుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా క్యాన్సల్ అయింది. సంపత్ నంది ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ కోసం స్క్రిప్ట్ కూడా పూర్తి చేసాడట. సంపత్ చెప్పిన ఫుల్ స్క్రిప్ట్ కళ్యాణ్ రామ్ కి కూడా బాగా నచ్చిందట. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి సంపత్ నంది, కళ్యాణ్ రామ్ కి హిట్ ఇస్తాడేమో చూడాలి. ఇక కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ‘తుగ్లక్’ సినిమాలో అలాగే సతీష్ వేగ్నేశ చిత్రంలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More