కళ్యాణ్ రామ్ సినిమా ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్ !
Published on Mar 10, 2018 6:46 pm IST

క‌ల్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌కత్వంలో విశ్వ‌ప్ర‌సాద్‌, భ‌ర‌త్ చౌద‌రి నిర్మాత‌లుగా రూపొందించిన సినిమా ఎంఎల్ఎ మర్చి 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టి.జి విశ్వప్రసాద్ సమర్పణ లో ,బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.

మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 17న కర్నూల్ లో నిర్వహించనున్నారు. బ్రహ్మానందం ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాలోని మొదటి పాట విడుదలై పాపులర్ అయ్యింది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.

 
Like us on Facebook