ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ కొత్త మూవీ

ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ కొత్త మూవీ

Published on May 5, 2014 10:51 AM IST

Kalyan-Ram
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, మల్లికార్జున్ దర్శకత్వంలో మంచి అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద ఫ్లాప్ గా నిలిచిన సినిమా ‘కత్తి’. కళ్యాణ్ రామ్ ఈ సినిమా తర్వాత చేసిన ‘ఓం’ సినిమా కూడా పరజయాన్నే అందుకుంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా తనకు ‘కత్తి’ రూపంలో ఫ్లాప్ ఇచ్చిన మల్లికార్జున్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మాకు అందిన సమాచారం ప్రకారం కళ్యాణ్ రామ్ – మల్లికార్జున్ కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమా మే 15న లాంఛనంగా ప్రారంభం కానుంది. అలాగే మే చివరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాని కొమరం వెంకటేష్ నిర్మించనున్నాడు. హీరోయిన్, మిగిలిన నటీనటులు మరియు టెక్నికల్ టీం వివరాలను త్వరలో అధికారికంగా తెలియజేస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు