బాలయ్య-ఎన్టీఆర్ మల్టీస్టారర్ కోసం కళ్యాణ్ రామ్ ప్రయత్నాలు.

Published on May 28, 2020 8:00 am IST

స్వర్గీయ నందమూరి తారక రామారావు తన కొడుకులు బాలయ్య, హరికృష్ణతో కలిసి చిత్రాలు చేశారు. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య తో పాటు కళ్యాణ్ రామ్ నటించారు. బాలయ్య ఎన్టీఆర్ గా నటించిన ఈ చిత్రాలలో కళ్యాణ్ రామ్ హరికృష్ణ పాత్ర చేశారు. ఐతే బాబాయ్ బాలయ్యతో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించింది లేదు. ఈ కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా హీరో కళ్యాణ్ రామ్ ఈ కాంబినేషన్ తెరపైకి తేవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. వారిద్దరితో లేదా కుదిరితే తాను కూడా కలిసి ఓ మూవీ చేయాలన్నది ప్లాన్ అట. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై ఈ మూవీ తెరకెక్కించాలని ఆయన సంకల్పంగా తెలుస్తుంది. ఐతే ఈ ప్రాజెక్ట్ సాకారం కావడం ఇప్పట్లో అయ్యే పనైతే కాదు. ఎన్టీఆర్ మరో రెండేళ్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ తర్వాతైనా ఈ ప్రాజెక్ట్ ఆయన చేయాలంటే మంచి కథ కుదరాలి, ఆయన ఆసక్తి చూపాలి.

సంబంధిత సమాచారం :

More