ఫుల్ కామెడీతో రానున్న ‘కళ్యాణ్ రామ్’ !

ఫుల్ కామెడీతో రానున్న ‘కళ్యాణ్ రామ్’ !

Published on Jul 16, 2019 8:24 PM IST

దర్శకుడు సంపత్ నందికి కామెడీ బాగా రాస్తాడనే మంచి పేరు ఉంది. కాగా సంపత్ నంది ఇప్పటికే కళ్యాణ్ రామ్ కోసం ఓ మంచి కామెడీ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కెనున్నట్లు తెలుస్తోంది. అయితే పటాస్ తరువత కామెడీ సినిమాలు పెద్దగా చేయని కళ్యాణ్ రామ్, సంపంత్ నంది సినిమాలో మాత్రం పక్కా కామెడీ అంశాలు హైలెట్ అయ్యే విధంగా సినిమాని ప్లాన్ చేయమని సంపంత్ కి చెప్పాడట. సంపత్ కూడా సినిమా మొత్తం ఫుల్ ఎంటర్ టైన్ గా సాగేలా ప్లాన్ చేస్తున్నాడట.

ముఖ్యంగా సపంత్ నంది కళ్యాణ్ రామ్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని… సినిమా మొత్తం మీద కళ్యాణ్ రామ్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉండేలా చూసుకున్నారని సమాచారం. ఆ పాత్రలోని వేరియేషన్స్ కారణంగానే సినిమాలో కామెడీ సీక్వెన్స్ హైలెట్ గా నిలుస్తాయట. మరి కళ్యాణ్ రామ్ – సంపత్ నంది కాంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కి మంచి హిట్ ఇస్తోందేమో చూడాలి. సంపత్ నంది మాత్రం ఈ సారి మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు