ఫేస్బుక్ లో అడుగు పెట్టిన కళ్యాణ్ రామ్

ఫేస్బుక్ లో అడుగు పెట్టిన కళ్యాణ్ రామ్

Published on Jul 27, 2014 4:08 PM IST

sher_kalyan

నందమూరి కళ్యాణ్ రామ్ కి చిత్ర పరిశ్రమ లో నెమ్మదస్తుడి గానే కాకుండా మంచి నడవడి గల వ్యక్తిగా పేరుంది. ప్రస్తుతం తనకు సంభందించిన ఎన్నో విషయాలు తన అభిమానులతో స్వయంగా పంచుకోవడానికి ఫేస్బుక్ లో అడుగు పెట్టారు. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడానికి కళ్యాణ్ రామ్ ప్రయత్నిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ‘షేర్’ ‘పటాస్’ అనే రెండు చిత్రాలతో బిజీ గా వున్నారు. ఈ రెండు చిత్రాలు హై వోల్టేజ్ కల్గిన కామెడీ ఎంటర్టైనర్లుగా తయారు కానున్నాయి. ‘పటాస్’ చిత్రాన్ని యెన్.టి. ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నారు.

ఇంకో రెండు భారీ బడ్జెట్ చిత్రాలని నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ ఈ ఏడాది నిర్మాతగా చాలా బిజీ గా వుండనున్నాడు. ఒక చిత్రం లో యెన్ టి. ఆర్ హీరో కాగా ఇంకో చిత్రంలో రవి తేజ హీరో గా నటించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు